బంగ్లాదేశ్:ఘోర అగ్నిప్రమాదం.. 70మంది మృతి
- February 21, 2019
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 70మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం 2వందలకు పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ పాత అపార్ట్మెంట్ భవంతిలో గ్యాస్ సిలెండర్ పేలి మంటలు అందుకున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు.
ఢాకాలో పాతబస్తీ అయిన చౌక్బజార్ లో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత ఇరుకుగా రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదతీవ్రత పెరిగింది. మంటలందుకున్న అపార్ట్మెంట్ కిందనే కెమికల్, ప్లాస్టిక్ గోదాములున్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడంతో ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే నిలిచిపోయిన వాహనదారులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







