ఫ్లోరిడాలో తెలంగాణ వాసిని చంపేశారు
- February 20, 2019
ఫ్లోరిడా:అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి...అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మత్యువాత పడుతున్నారు. తాజాగా మరొకరిని కాల్చిపడేశారు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన కొత్త గోవర్దన్ రెడ్డి ఏడేళ్ల క్రితం జాబ్ కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఓ డిపార్ట్ మెంట్ స్టోర్‌లో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు స్టోర్‌లోకి చొరబడ్డారు. ఆ సమయంలో గోవర్ధన్ రెడ్డితో మరొకరు స్టోర్‌లో ఉన్నారు. వచ్చిన వారు విచక్షణారహితంగా ఫైరింగ్ ఓపెన్ చేశారు. తూటాలు తగిలి గోవర్దన్ రెడ్డి అక్కడికక్కడనే కుప్పకూలి చనిపోయాడు. మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. డెడ్ బాడీని హైదరాబాద్‌కు రప్పించేందుకు సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కుటుంబసభ్యులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..