స్మగ్లింగ్ - ఒమన్‌లో 10 మంది అరెస్ట్
- February 21, 2019
మస్కట్: పది మంది వలసదారులు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. డీజిల్, నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్‌ని స్మగుల్ చేస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ముసాందామ్ మరియు సలాలాలోని తీర ప్రాంతాల్లో నిందితులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దోఫార్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గరలో ఫిషింగ్ బోట్‌లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారనీ, వారి నుంచి కొంత మొత్తంలో ఖత్‌ని స్వాధీనం చేసుకున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితుల వద్ద 2200 ప్యాకెట్ల ఖత్ లభ్యమయ్యింది. ముసాందామ్ గవర్నరేట్‌లో కోస్ట్ గార్డ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఆసియా జాతీయులే. డీజిల్‌ని బోట్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మరో కేసులో కోస్ట్‌గార్డ్ పెట్రోల్ - కుమ్జార్, ముగ్గురు వ్యక్తుల్ని తీసుకెళుతున్న బోట్‌ని సీజ్ చేశారు. అందులో వున్న ముగ్గురు వ్యక్తులు ఆసియాకి చెందినవారే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







