యూఏఈలో వింటర్ ఈ నెలలోనే ముగియనుందా?
- February 21, 2019
యూఏఈ రెసిడెంట్స్ వర్షం, చలితో కూడిన ఆహ్లాదకర వాతావరణానికి గుడ్ బై చెప్పబోతున్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే, క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) మిటియరాలజిస్ట్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకునే అవకాశం వుంది. కాగా, వచ్చే వారంలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం వున్నందున, కొన్ని చోట్ల 'వేసవి' వాతావరణం అనుభవంలోకి వస్తుందని, ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గే సూచనలు కన్పించడంలేదు గనుక, వింటర్ సీజన్ ఈ నెలలోనే ముగియవచ్చునని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







