ఉదయాన్నే గ్లాస్ కొబ్బరి నీరు తాగితే...
- February 22, 2019
కొబ్బరి నీళ్లు. ఏదో దాహం వేస్తేనో, వేడి చేసిందనో తాగుతూ ఉంటారు చాలామంది. కానీ ఈ కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్ సమయంలో కొబ్బరి నీరు తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఈ నీళ్లను తీసుకోవడం వలన శరీరంలోని వేడి తగ్గిస్తుంది.
కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించి.. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. తరచు కొబ్బరి నీరు తాగడం వలన అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం... కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఈ నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఈ నీళ్లను చర్మంపై రాసుకుంటే శరీరంపై గల పొక్కులు, ర్యాషెస్ తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లకు అంతటి ప్రాధాన్యత ఉన్నది.
కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపవుతుంది. ఉదయాన్నే గ్లాస్ కొబ్బరి నీరు తాగి చూడండి.. మీకే తేడా కనిపిస్తుంది. కొబ్బరి నీరు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. ఈ నీటిని చర్మానికి కూడా రాసుకోవచ్చును.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







