యూ.ఏ.ఈ లో 'స్త్రీ' శక్తికి సత్కారం

- February 25, 2019 , by Maagulf
యూ.ఏ.ఈ లో 'స్త్రీ' శక్తికి సత్కారం

షార్జా:యూఏఈ లోని స్త్రీ శక్తికి పట్టం కడుతూ వివిధ రంగాలలో ఆధ్బుత కృషి చేస్తున్న తెలుగు మహిళలను ఫెడరేషన్ ఆఫ్ NRI  కల్చరల్ అసోసియేషన్ మరియు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్  అసోసియేషన్ యూఏఈ లో ఘనంగా సత్కరించి బతుకమ్మ  అవార్డ్స్ ప్రధానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య, విద్య, సంస్కృతి, నృత్యం, జర్నలిజం మరియు సమాజ సేవ చేస్తున్న సుందర ఉపాసన, ప్రశాంతి చోప్రా, సౌమ్య చిత్తర్వు, హిమబిందు, ప్రీతి, డా.పర్వీన్ బాను, ప్రభ, సృజనీ, విజేత, లత, రత్న, కే.లక్ష్మి, స్.నాగమణి,చందాన, దీపికా, అనురాధ, భారతి, భవాని బాబూరావు, జిజియా బాయ్, హరిత రెడ్డి, రాధికా, సంగిరెడ్డి ప్రియా లకు ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా వరప్రసాద్,రాజేష్ సామ్యూల్, శలవోద్దీన్, జువ్వాడి శ్రీనివాస్ సత్కరించారు..మహిళా లోకాన్ని ప్రోత్సహిస్తూ రాబోవు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమానికి సహకరించిన శ్రీనివాస్ జనగామ,మహేందర్ రెడ్డి కుంభాల,రమేష్ ఏమూల,కృష్ణ డొంకినేని,వంశి గౌడ్,శ్రీకాంత్ చిత్తర్వు,సంతోష్ గౌడ్ తదితరులను మెమెంటోలతో సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com