ఎన్నికల్లో గెలిచి మాట్లాడతా: చివరి 'మన్ కీ బాత్' లో మోడీ
- February 24, 2019
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ...సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ బాత్ అన్నారు.ఈ ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైనదన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నందున ప్రజల ముందుకు రాలేనని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, ప్రజాస్వామ్య విలువలు కాపాడటం తన భాధ్యత అని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ మే నెలలో మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతానంటూ లోక్ సభ ఎన్నికల్లో విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
పది రోజుల క్రితం భరతమాత తన సాహస పుత్రులు కొందరిని కోల్పోయిందని,పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి,జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మోడీ తెలిపారు.దేశానికి సేవ చేస్తున్న జవాన్లకు ఎంతో రుణపడి ఉన్నామని మోడీ అన్నారు. దేశ ప్రజలందరూ ఈ ఘటనతో తల్లడిల్లిపోయారని,ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని, అమర జవాన్లు, వారి కుటుంబాలకు సంతాపాలు, సంఘీభావాలు వెల్లువెత్తాయని అన్నారు. మన సాయుధ బలగాలు ఎప్పుడూ మొక్కవోని సాహసం ప్రదర్శిస్తూనే ఉన్నాయని, ఒక వైపు అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూనే మరోవైపు శాంతిని కాపాడుతున్నాయన్నారు. టెర్రరిస్టులకు వారి భాషలోనే ధీటుగా జవాబిస్తున్నాయని కొనియాడారు.
ఫిబ్రవరి-29న మాజీ ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ జయంతి సందర్భంగా ఆయనకు తన జోహార్లు అని మోడీ అన్నారు. నాలుగేళ్లకొకసారి మాత్రమే ఆయన జయంతిని జరుపుకోగల్గుతున్నామని, దేశానికి ఆయన సేవలు అనిర్వచనీయమని అన్నారు. దేశంలోని యువత అందరూ ఓటు వేయడానికి ముందుకు రావాలని,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు వేయడం తప్పనిసరి అని మోడీ అన్నారు.
మార్చి 3న జంషెడ్ టాటా,బిర్సా ముండా జయంతి సందర్భంగా వారిని స్మరించుకొన్నారు. బిర్సా ముండా త్యాగాలు.బలిదానాన్ని మరువలేమన్నారు. దేశం కోసం 25 ఏళ్ల వయస్సులో బిర్సాముండా బలిదానం అయ్యారన్నారు. టాటా ఇస్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్,టాటా స్టీల్ వంటి ఎన్నో సంస్థలను జంషేడ్ టాటా నెలకొల్పారన్నారు. అప్పటి టాటా సైన్సెస్ ఇప్పుడు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ గా మారిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







