పాక్ తో యుద్ధంపై నేడే కాబినెట్ భేటీ
- February 28, 2019
పాక్ కు బుద్ధిచెప్పందుకు భారత్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒకవైపు ఉగ్రమూకల ఏరివేతలో సహకరించగపోగా.. యాన్టీ టెర్రరిస్ట్ అపరేషన్ చేస్తున్న భారత్ ప్రయత్నాలను పాక్ అడ్డుకుంటోంది. పుల్వామా దాడికి ప్రతికారంగా జైషే స్థావరాలను లక్ష్యం చేకొని భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంలో ఇంటా.. బయట ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియను భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రవేశించి ఉగ్రస్థావరాలను కూకటివేళ్లతో పీకేందుకు భారత సైన్యం చర్యలు తీసుకుంటోంది.
ఈ వ్యహారాన్ని అడ్డుపెట్టుకొని తమ భూభాగంపై భారత బలగాలు వచ్చాయని గగ్గోలుపెడుతున్న పాక్..తమ యుద్ధవిమానాలు భారత్ సరిహద్దుల్లో పంపించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించేందుకు ఈ రోజు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అవుతోంది. సాయంత్రం 6:40కి జరిగే ఈ భేటీలో ప్రధాని మోడీ తో పాటు కేబినెట్ మంత్రులంతా హాజరౌతారు. ఈ భేటీలో త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరౌతున్నట్లు తెలిసింది.
సాయంత్రం జరిగే ఈ భేటీలో ఇండో పాక్ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పాక్ ను అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాక్ కవ్వింపు చర్యలు రోజు రోజుకు మితిమీరుతున్న నేపథ్యంలో ఇక యుద్ధం చేయడమే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







