'అభినందన్' ను భారత్ కు పంపిస్తామని ప్రకటించిన పాక్
- February 28, 2019
భారత ఐఎఎఫ్ కమాండర్ అభినందన్ ను తిరిగి భారత్ కు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రాంతీయ మీడియా ఛానల్ కు చెప్పారు. ఐఎఎఫ్ పైలట్ విడుదల విషయంలో భారత్ తో చర్చలు జరిపే దిశగా పాక్ అడుగులు వేస్తోందన్నారు. ఈ చర్చలతోనైనా ఇరుదేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్చార్చుతుందని అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ ఒక బాధ్యతయుతమైన దేశమనే విషయం ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాలనే సందేశాన్ని ఇస్లామాబాద్ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్నారు. 'భారతీయ ప్రజలారా.. మీ పైలట్ అభినందన్ పాక్ లో క్షేమంగా ఉన్నారు. జనీవా ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంది. మీ పైలట్ వంద శాతం సేఫ్ గా ఉన్నారు. ఆయనకు కావాల్సిన ఆహారం, వైద్య సాయం అందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం'' అని అన్నారు.
ఇరుదేశాల మధ్య ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ యుద్ధ ఖైదీలను శత్రువులుగా చూడమని చెప్పారు. ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను శాంతిపర్చే దిశగా పాకిస్థాన్ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. భారత పైలట్ అభినందన్ ను సురక్షితంగా పాకిస్థాన్ తక్షణమే విడుదల చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా ఖురేషీ పై విధంగా బదులిచ్చారు. పైలట్ విడుదల విషయంలో పాకిస్థాన్ బహిరంగంగానే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్థాన్ మాజీ ప్రధాని జిల్ఫికర్ అలి బుట్టో మనమరాలు భారత పైలట్ అభినందన్ ను రిలీజ్ చేయమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది.
పుల్వామా ఉగ్రదాడి ఘటన తో పాకిస్థాన్ పై ప్రతీకారంగా భారత్ వైమానక దళాలు బాంబుల దాడులతో విరుచుకపడ్డారు. పాకిస్థాన్ ప్రతిదాడిని తిప్పికొట్టిన ఐఎఎఫ్ కమాండర్లు యుద్ధ విమానాలతో దయాది యుద్ధ విమానాలను పాక్ భూభాగాల్లోకి తరిమికొట్టారు. ఈ క్రమంలో ఐఎఎఫ్ పైలట్ అభినందన్ విమానం కూలి ప్యారసూట్ సాయంతో పాక్ సరిహద్దుల్లో దిగాడు. అక్కడి పాక్ బలగాలు అభినందన్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







