రివ్యూ: 118..థ్రిల్లర్ అదిరింది!

- March 01, 2019 , by Maagulf
రివ్యూ: 118..థ్రిల్లర్ అదిరింది!

నటీనటులు : కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే

- ADVT -

 
దర్శకత్వం : కే వి గుహన్

నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫర్ : కే వి గుహన్

ఎడిటర్ : తమ్మిరాజు

కళ్యాణ్ రామ్ కి కొత్తదనం కోసం ప్రయత్నించే లక్షణముంది. అదే అతన్ని ఎప్పుడూ కొత్తగా ప్రజెంట్ చేస్తుంటుంది. కె.విగుహాన్ వంటి టెక్నీషన్ తో కలసి కళ్యాణ్ రామ్ ఒక థ్రిల్లర్ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతని ప్రయత్నం ప్రేక్షకుల్ని ఎంత వరకూ థ్రిల్ చేసిందో చూద్దాం..

కథ :

గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతని కలలో కనిపించిన ఆద్యా ( నివేత థామస్ ) ఆలోచనలతో అతని జీవితం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మరోసారి కూడా అదే ప్లేస్ లో అదే కల రావడంతో ఆ ప్లేస్ నుండి తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు గౌతమ్. అక్కడి నుండి అతని ప్రయాణం తీసుకునే మలుపులు ఏంటి..? అసలు ఆద్యా ఎవరు..? గౌతమ్ కే ఏందుకు కనపడుతుంది అనేది మిగిలిన కథ..?

కథనం:

118 ఈ టైటిల్ ని ఎలా జస్టిఫై చేస్తారా అనే ఆలోచనలకు సినిమా మొదలైన పది నిముషాల్లోనే క్లారటీ ఇచ్చాడు దర్శకుడు. కాన్సెప్ట్ నుండే హీరో క్యారెక్టరైజేషన్, టైటిల్ వచ్చాయని స్పష్టం అయ్యింది. గుహున్ కుండే సినిమాటోగ్రాఫీ ప్రతిభ ఈకథను మరింత థ్రిల్లింగ్ మార్చింది. కళ్యాణ్ రామ్ లుక్, బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు. ఒక తెలియని రహాస్యాన్ని తనకు మాత్రమే కనిపిస్తున్న ఆధారాలతో హీరో హాంట్ చేసే విధానం ఎక్కడా బిగి సడలకుండా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా కూడా కథనుండి దారి తప్పకుండా కాన్పెస్ట్ మీదే కథను పరుగులు పెట్టించాడు. తీగ లాగితే డొంక కదలడం అనేది థ్రిల్లర్ సినిమాలకుండే ప్రాధమిక లక్షణం కానీ ఆ తీగను ఒక సైకిలాజికల్ టచ్ ఇచ్చాడు. అతని కలలో కనిపించే ఆధారాల కోసం బయట ప్రపంచంలో హీరో చేసే పరిశోధన చాలా ఇంట్రెస్ట్ గా మారింది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆద్యాకు హీరోకు అసలు సంబంధం ఉండదు.. తన కలలో కనిపించే అమ్మాయితో తనకు ఏమీ కాదు.. కానీ హీరో చేసే ప్రయత్నాలు ఆగవు.. ఆ అమ్మాయి తనకెందుకు కనపడతుంది. ఇలాంటి ప్రశ్నలకు జవాబుల కోసం కళ్యాణ్ రామ్ చేసే పోరాటం లో చాలా దారులు మూసుకుపోతాయి. కొన్ని దారులలో తనకు ప్రమాదాలు ఎదరవుతాయి. కానీ అతని ప్రయత్నాలు ఆగవు. థ్రిల్లర్ సినిమాలకుండే గ్రిప్పింగ్ సాగే కథనం ఈ మూవీ హైలెట్ గా నిలుస్తుంది. సినిమాటిక్ లిబర్టీలను ఎక్కువుగా వాడకుండా రియలిస్టిక్ వే లో కథ నడుస్తుంది. తను వెతుకుతున్న లక్ష్యం చేరే ప్రయత్నంలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కి ఎదురయ్యే మలుపులు ఆసక్తికరంగా ఉన్నాయి. రాజీవ్ కనకాల, హారితేజ క్యారెక్టర్స్ కథను తిప్పే మలుపులు ఆసక్తికరంగా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ తన క్యారెక్టర్ లో మాత్రమే ఉండిపో్యాడు. థ్రిల్లింగ్ సాగే కథలో కనిపించే ప్రేమకథలు స్పీడ్ బ్రేకర్స్ గా మారతాయి. అందుకే రెగ్యులర్ గా అనిపించే షాలిని పాండే తో హీరో ప్రేమకథ సాదా సీదాగా మారింది. థ్రిల్లర్ గా సాగే కథలో సన్నివేశాలలో షుగర్ కోటెడ్ హాస్యాన్ని నింపే ప్రయత్నం చేయలేదు దర్శకుడు గుహాన్. అందుకే కథ మూడ్ ఎక్క్డడా చెడలేదు. ఇక నివేత థామస్ ఈ కథకు ఎంత ముఖ్యమో చెప్పేకంటే ఈ కథ ఆమెదే అనడం బాగుటుంది. తన కథలోకి హీరో వచ్చి ఈ కథను పూర్తి చేస్తాడు. కానీ వారి కథ ఆమె చనిపోయాక మొదలవుతుంది. ఇలాంటి పాయింట్ ని ఇంట్రెస్టింగ్ నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాత గా మహేష్ కోనేరు నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
గ్రిప్పింగ్ థ్రిల్లర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com