ఉప్పల్ వన్డేలో భారత్ ఘన విజయం
- March 02, 2019
ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్‌లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా, వన్డే సిరీస్‌లో జూలు విదిల్చింది. ఉప్పల్‌లో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ-37, విరాట్ కోహ్లీ-44, ధోనీ-59, కేదార్ జాదవ్- 81 పరుగు లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు… తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆసీస్‌లో ఉస్మాన్ ఖ్వాజా-50, మాక్స్‌వెల్-40, స్టైనిస్-37, అలెక్స్ క్యారీ-36, కౌల్టర్ నైల్-28 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు రెగ్యులర్‌గా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడ లేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్, షమీలు రెండేసి వికెట్లు సాధించగా, కేదార్ జాదవ్‌కు ఒక వికెట్ లభించింది.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







