'సాహో- చాప్టర్ 2'..అదరకొట్టేసిన ప్రభాస్
- March 03, 2019
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా తెరకెక్కుతోందని సాహో చాప్టర్ 1 వీడియోనే చెప్పింది.
ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసేందుకు మరో చాప్టర్ వచ్చేసింది . ఈరోజు శ్రద్ద కపూర్ పుట్టిన రోజు సందర్బంగా సాహో మేకర్స్ 'షేడ్స్ ఆఫ్ సాహో- చాప్టర్ 2' పేరిట సరికొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ మొత్తం యాక్షన్ తో నింపేశారు. విలన్లతో ఛేజింగ్ లు , భారీ సెట్టింగ్లు , హెవీ యాక్షన్ తో నింపేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ కనిపించకపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఈ 'షేడ్స్ ఆఫ్ సాహో- చాప్టర్ 2' లో ప్రభాస్ కనిపించాడు. విలన్లతో ఫైట్ చేస్తూ కనిపించాడు. సన్నివేశాలు హాలీవుడ్ సినిమాని తలపిస్తున్నాయి. చివర్లో శ్రద్ద కనిపించి ఆకట్టుకుంది. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!