శారీరకంగా కాదు.. మానసికంగా వేధించారు.. అభినందన్ వర్ధమాన్
- March 03, 2019
శత్రు సైన్యం చేతిలో బందీగా ఉన్న సమయంలో తాను తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఎఫ్‌సీఎంఈ)లో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో శత్రుదేశ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్.. తాను ప్రయాణిస్తున్న మిగ్21 విమానం కూలిపోవడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టాడు. దీంతో అతను పాక్ ఆర్మీ వద్ద 48 గంటల పాటు బందీగా ఉన్నాడు.
ఆ తర్వాత అంతర్జాతీయ సమాజంతో పాటు.. ప్రపంచ దేశాల ఒత్తిడి, భారత దౌత్యనీతికి తలొగ్గిన పాకిస్థాన్ అభినందన్‌ను సురక్షితంగా భారత్‌కు అప్పగించింది. అభినందన్ భారత్‌కు చేరుకోగానే ఆస్పత్రికి తరలించి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాను పాకిస్థాన్ వద్ద బందీగా ఉన్న సమయంలో తీవ్ర మానసిక వేధింపులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్న అభినందన్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్ధమాన్ వారితో మాట్లాడుతూ, దాదాపు 60 గంటలపాటు పాకిస్థాన్‌లో బందీగా ఉన్న తనను ఆ దేశ అధికారులు తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని చెప్పారు.
అయితే శారీరకంగా మాత్రం తనను హింసించలేదని తెలిపారు. భారత రక్షణ రహస్యాలను రాబట్టేందుకు పాక్ అధికారులు ఆయనను పలువిధాలుగా ప్రశ్నించారని, ఈ క్రమంలో ఆయనను మానసికంగా వేధించారని అధికార వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తాసంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







