డీజిల్‌, కిరోసిన్‌ ధరల విధానానికి క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

- December 28, 2015 , by Maagulf
డీజిల్‌, కిరోసిన్‌ ధరల విధానానికి క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

  బహ్రెయిన్‌ క్యాబినెట్‌ డీజిల్‌, కిరోసిన్‌ ధరలకు సంబంధించి కొత్త విధానానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో డీజిల్‌, కిరోసిన్‌ ధరలు క్రమక్రమంగా పెరగనున్నాయి. డొమెస్టిక్‌ వినియోగదారులకు ఇది మింగుడుపడని విషయమే అయినా, దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలంచి, కొత్త ధరల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎనర్జీ మినిస్టర్‌ అబ్దుల్‌ ముస్సేన్‌ బిన్‌ అలీ మీర్జా చెప్పారు. సబ్సిడీ, ప్రభుత్వ ఆదాయం వంటి అనేక అంశాల్లో సంబంధిత విభాగాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి, నివేదికలు తెప్పించుకుని కొత్త ధరల విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారాయన. ఈ విధానంతో దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు అలీ మీర్జా. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com