14,000 సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేత
- March 05, 2019
దుబాయ్:కమర్షియల్ కంప్లియాన్స్ అండ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) సెక్టార్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ దుబాయ్ (డిఇడి) 13,948 సోషల్ మీడియా అకౌంట్స్‌ని 2018లో మూసివేసింది. ట్రేడ్ మార్క్స్ అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ ఈ-కామర్స్‌కి సంబంధించి వీటిని మూసివేసినట్లు తెలుస్తోంది. కౌంటర్‌ఫీట్ గూడ్స్‌ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించి అకౌంట్స్‌ని మూసివేయించామని అధికారులు పేర్కొన్నారు. ఈ అక్కౌంట్లకు మొత్తంగా 77.9 మిలియన్ ఫాలోవర్స్ వున్నట్లు గుర్తించారు. వీటిల్లో అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ 13,529 వుండగా, ఫేస్‌బుక్‌కి సంబంధించి 419 అకౌంట్లు వున్నాయి. 45 వెబ్‌సైట్లను కూడా ఈ సందర్భంగా మూసివేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఎలాంటి ఫేక్ ప్రచారాల్నీ, విక్రయాల్నీ ప్రోత్సహించరాదని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







