కర్వా బస్‌లలో మహిళలకు రిజర్వేషన్
- December 28, 2015
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం మౌసలాత్, కర్వా బస్సుల్లో తొలి రెండు వరుసల సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జస్సిమ్ బిన్ జైఫ్ అల్ సుల్తానీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నామని మౌసలాత్ వెలషడించింది. కర్వా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నిర్వాహక సంస్థ అయిన మౌసలాత్, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లను గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది. ఇటీవల 150 కొత్త లో ఫ్లోర్ బస్సులు ప్రవేశపెట్టగా, అతి త్వరలో ఇంకో 150 బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. వీల్‌ఛైర్‌కే పరిమితమైనవారు కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా 55 బస్సుల్ని రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. కర్వా స్మార్ట్ కార్డ్ ద్వారా క్యాష్‌లెస్ ట్రావెలింగ్ సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించారు ప్రయాణీకులకు. ఉదయం 4.30 నిమిషాల నుంచి రాత్రి 11.30 నిమిషాల వరకు 50 రూట్లలో సుమారు 2000 మౌసలాత్ బస్సుల్ని నడుపుతున్నారు. 2016లో మరో మూడు నుంచి నాలుగు కొత్త రూట్లు అలాగే ఇంకొన్ని బస్సుల్ని ప్రవేశపెట్టనున్నామని సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









