డీజిల్, కిరోసిన్ ధరల విధానానికి క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
- December 28, 2015
బహ్రెయిన్ క్యాబినెట్ డీజిల్, కిరోసిన్ ధరలకు సంబంధించి కొత్త విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో డీజిల్, కిరోసిన్ ధరలు క్రమక్రమంగా పెరగనున్నాయి. డొమెస్టిక్ వినియోగదారులకు ఇది మింగుడుపడని విషయమే అయినా, దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలంచి, కొత్త ధరల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ ముస్సేన్ బిన్ అలీ మీర్జా చెప్పారు. సబ్సిడీ, ప్రభుత్వ ఆదాయం వంటి అనేక అంశాల్లో సంబంధిత విభాగాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి, నివేదికలు తెప్పించుకుని కొత్త ధరల విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారాయన. ఈ విధానంతో దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు అలీ మీర్జా.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







