కేర్‌లెస్ డ్రైవింగ్: వెయ్యి మందికి పైగా ఉల్లంఘనులు.!
- March 07, 2019
2018లో కేర్‌లెస్ డ్రైవింగ్‌కి సంబంధించి, 1029 మంది డ్రైవర్లకు జరిమానాలు విధించినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల 136 ప్రమాదాలు కూడా జరిగాయి. రస్ ఆల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ ఖల్ సామ్ అల్ నక్బీ మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడడం వంటి చర్యలు ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది 20 నుండి 25 ఏళ్ల వయసు మధ్యవారే. కాగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి 400 దిర్హామ్‌లు జరిమానా, 4 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్స్ నమోదు చేస్తారు. కొన్ని ఉల్లంఘనలకు 1000 దిర్హాములు జరిమానా, 12 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







