ఇండో-పాక్ టెన్షన్ పై పెదవి విప్పిన ముషారఫ్
- March 07, 2019
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్‌ల మధ్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. తాజాగా ఆయన మాటలు భారత్ వాదనకు మరింత ఊతమిస్తున్నాయి. భారత్‌లో దాడులు జరిపేందుకు పాక్ నిఘా వర్గాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థని వినియోగించుకున్నట్లు చెప్పారు ముషారఫ్. ఓ పాక్ జర్నలిస్టుకు టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. 2003లో జైషే సంస్థ తనను రెండుసార్లు చంపడానికి యత్నించిందన్నారు. అధికారంలోవున్న సమయంలో మీరు.. జైషే సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, నాటి పరిస్థితులు భిన్నమైనవి చెప్పుకొచ్చారు. ఆ విషయంలో తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని మనసులోని మాట బయటపెట్టారు.
ప్రస్తుతం జైషేపై పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు ఆయన. ఉగ్రవాదులకు పాక్ కేరాఫ్‌గా మారిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నప్పటికీ, అలాంటిదేమీ లేదని పదేపదే బుకాయిస్తోంది ఇమ్రాన్ సర్కార్. పుల్వామా ఉగ్రదాడి కూడా జైషేనే చేసిందని భారత్ ఆధారాలతో బయటపెట్టింది. అవేమీ ఇమ్రాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..