ఏ.పి:మహిళలకు తీపి కబురు..

- March 08, 2019 , by Maagulf
ఏ.పి:మహిళలకు తీపి కబురు..

ఏపీలో మహిళలందరికీ శుక్రవారం నిజమైన శుభదినం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తీపి కబురందించింది ఏపీ సర్కార్‌. పసుపు-కుంకుమ పథకం రెండో విడత నగదు జమ చేసింది. ఒక్కో మహిళ ఖాతాలో 3,500 రూపాయలు వేసింది. శుక్రవారం ఆ నగదును మహిళలకు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

 
మహిళలు ఆకాశంలో సగం, వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి ముందు వరుసలో నిలబెడతామని గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్ధానాలు నీటిమీట రాతలు గానే మిగిలిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దళిత, గిరిజన, గర్భిణి, బాలింతల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చటమే గాక వాటికి క్రమం తప్పకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.

గర్భిణిలు, బాలింతలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ వేరుశనగ ముద్ద, రాగి జావ,పండ్లు తదితర బలమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందజేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,67,871 మంది దళిత మహిళలు, చిన్నారులు లబ్ది పొందుతున్నారు. అన్న అమ్రుతహస్తం పథకం ద్వారా గర్భిణి, బాలింతలకు ఒక పూట భోజన సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అన్నంతోపాటు ఆకుకూరలు, పప్పు, కూరగాయలతో సాంబారు ఉడికించిన కోడిగుడ్లు, 200 మి.లీ పాలను బలవర్థకమైన ఆహరంగా అందిస్తున్నారు. ఈ పథకంలో 6.62 లక్షల మంది గర్భిణిలు, బాలింతలకు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. గ్రామీణ మహిళలకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు ఒక్కో నెలకు రూ.33 కోట్లను ఖర్చు చేస్తున్నారు.

సబల పథకం ద్వారా బడి బయట ఉన్న 11 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు వారి ఇంటికే పోషకాహారాన్ని అందించే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 21 వేల మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కోసం ఏడాదికి 5.98 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వేతన పెంపు అంగన్వాడీలకు వరం రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కార్యకర్తలకు మొదటిసారి 4 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచారు. తరువాత 7 వేల నుంచి 10,500కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంగన్వాడీ ఆయాలకు మొదటి సారి రూ. 2,950 నుంచి రూ. 4,500కి పెంచారు. తరువాత రెండోసారి రూ.4,500 నుంచి రూ. 6 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. డ్వాక్రా మహిళలకు మొట్టమొదటిసారి 50శాతం రాయితీతో శానిటరీ నాప్ కిన్లు అందించేందుకు 127 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు మహిళలను ఆర్థికంగా వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు వారికి బ్యాంకు రుణాలు మంజూరు చేయడానికి స్త్రీ నిధిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ. లక్ష వరకూ రుణాలను మంజూరు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన ఒక డ్వాక్రా సంఘం ప్రస్తుతం జిల్లాలోనే మిగిలిన సంఘాల కంటే ఆదర్శంగా నిలిచింది. జి.కొత్తపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలలో ఖరీఫ్, రబీల్లో పండిన ధాన్యాన్ని మహిళ ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రామసంఘమే కొనుగోలు చేస్తోంది. 2006 ఖరీఫ్ సమయంలో వర్షాలు అధికంగా కురవడంతో మొక్కజొన్న పంట ఎక్కువగా దెబ్బతింది. దానిని కొనుగోలు చేయాలని గ్రామ సంఘానికి ఎంపీడీవో ద్వారకాతిరుమలతెలిపారు. దీంతో సంఘం ఆధ్వర్యంలో ఒక గోదామును లీజు ప్రాతిపదికన తీసుకుని మొక్కజొన్నను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ప్రతి సీజన్ లోనూ వారినే చుట్టుపక్కల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పౌరసరఫరాలశాఖ ద్వారా నడిచే ధాన్యం మిల్లులకు పంపించాలని తీర్మానించారు. అప్పటి వరకు వంటింటికే పరిమితమైన మహిళలు వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రతి ఏడాది నాలుగైదు గ్రామ పంచాయితీల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు తోలుతున్నామన్నారు గ్రామ సంఘం అధ్యక్షురాలు రెడ్డి నాగదేవి. దాదాపు 10 లక్షల రూపాయల మేర ఆదాయం సంపాదిస్తున్నామన్నారు. ఆ నిధులతోనే ప్రస్తుతం గ్రామంలో వీఓ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు నాగదేవి.

రాష్ట్రంలోని గిరిజన మహిళలకు పోషకాహారాన్ని అందించే క్రమంలో ఆహారబుట్ట పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పోషకారాలతో కూడిన వివిధ రకాల ఆహార పదార్ధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com