రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ మృతి
- March 09, 2019
రస్ అల్ ఖైమా:రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్డుపై ఎగ్జిట్ 122కి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందినవారంతా 15 నుంచి 19 ఏళ్ళ లోపు వయసువారే. రస్ అల్ ఖైమా ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కంట్రోల్ హెడ్ కల్నల్ మొహమ్మద్ అల్ బహ్మార్ మాట్లాడుతూ, సాయంత్రం 6.55 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి రికార్డు సమయంలో చేరుకోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఎమిరేటీలు ఒక ఆసియా వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఎమిరేటీ యువకులు కూడా గాయపడ్డారు. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







