ఢిల్లీ:కారులో సజీవదహనమైన తల్లీకూతుళ్లు..
- March 11, 2019
ఢిల్లీ:ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఫ్లైఓవర్‌పై జరిగింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా అతని భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి పనిమీద బయటికి వెళ్లారు. అయితే కారు అక్షర్ధామ్ గుడివద్దకు రాగానే కారులో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఉపేంద్ర ఒక కూతురుని తీసుకుని బయటకు దూకేశాడు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి భార్య రంజనా మిశ్రా, కూతుళ్లు నిక్కీ, రిధి సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా భార్య పిల్లలు కాలి బూడిద అవ్వడంతో ఉపేంద్ర ఎటువంటి సమాచారం ఇచ్చే పరిస్థితిలో లేడని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







