పద్మ అవార్డు ప్రధానోత్సవ వేడుక..
- March 11, 2019
పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఉత్సాహంగా సాగింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి పద్మ అవార్డులను ప్రధానం చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. నాట్య రంగంలో అమోఘమైన ప్రతిభను కనబరిచినందుకుగానూ ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది.
ఇండియన్ మైఖెల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన డ్యాన్సింగ్ స్టయిల్స్‌ను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాదాపు 13 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2001లో మోహన్‌లాల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మోహన్‌లాల్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్‌లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







