వేశ్య పాత్రని తెలిసే.. ఇష్టంతో.. : రమ్య కృష్ణ
- March 11, 2019
రమ్యకృష్ణ.. పదహారేళ్ల పడుచుపిల్లలా యువహృదయాలను కవ్వించగలదు.. అత్తగారిగా పెత్తనాన్ని చెలాయించగలదు.. శివగామిలా ఘర్జించనూ గలదు. నాలుగుపదుల వయసులోనూ చెదరని అందంతో మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ డిఫరెంట్ రోల్స్ చేస్తోంది. తాజాగా ఓ సినిమాలో వచ్చిన అవకాశాన్ని తనకంటే ముందు మరో నటి నదియాను అడిగితే ఆమె తిరస్కరించిందట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రను ఛాలెంజింగ్ తీసుకుని నటించింది.
త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వం వహించిన ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో రమ్య శృంగారతార పాత్ర పోషించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. రమ్యకి ఈ వయసులో ఇలాంటి పాత్ర చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని చెవులు కొరుక్కునేవారికి ఓ ఇంటర్వ్యూలో రమ్య ఆసక్తికరంగా సమాధానం చెప్పింది.
‘ ఈ చిత్రంలో నేను వేశ్య పాత్రలో నటించాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే .. ఈ పాత్ర మరో ఎత్తు. ఓ సన్నివేశం కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నాను. ఆ సన్నివేశం చిత్రీకరించడానికి రెండు రోజులు పట్టింది. అది చూసి నా కంటే, నా అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్న వారే షాకయ్యారు. కొన్ని పాత్రలు డబ్బు కోసం చేస్తాం, మరి కొన్ని పాపులారిటీ కోసం, ఇంకొన్నింటిని పేరు కోసం చేస్తాం, కొన్ని పాత్రలు మనసు హత్తుకునేవి వుంటాయి.
దర్శకుడు ఆ పాత్రని మలచిన తీరు ఎంతో ఆకర్షిస్తుంది. దాంతో జయాపజయాలను పక్కన పెట్టి ఎంతో ఇష్టంతో చేస్తుంటాం. అలాగే ఇ సినిమాలో వేశ్య పాత్రని కూడా నేను ఎంతో ఇష్టపడే చేశాను’ అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 29న సూపర్ డీలక్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







