వైసీపీ క్యాండేట్స్ లిస్ట్..
- March 11, 2019
పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీల్లో హడావుడి మొదలైంది. అభ్యర్థుల జాబితాను కొలిక్కి తెచ్చేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ 162 స్థానాలకు క్యాండేట్స్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే.. గెలుపు గుర్రాల కోసం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు మూడు చోట్ల మినహా దాదాపు అన్ని చోట్లు అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేసింది వైసీపీ .. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను ఇచ్చాపురం నుంచి పిరియా సాయిరాజ్, పలాస నుంచి డాక్టర్ అప్పలరాజు, టెక్కలి బరిలో దువ్వూడ శ్రీనివాస్, పాతపట్నం నుంచి శ్రీమతి రెడ్డి శాంతి, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావులు పోటీ చేయనున్నారు. ఆముదాలవలస నుంచి తమ్మినేని సీతారాం, ఎచ్చెర్ల స్థానం నుంచి గొర్లె కిరణ్ కుమార్, నరసన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాస్, రాజాం నుంచి కంబాల జోగులు. పాలకొండ నుంచి వి కళావతిల పేర్లను సిద్ధం చేశారు.
విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది.. భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్, విశాఖ ఈస్ట్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్. విశాఖ సౌత్ నుంచి రమణమూర్తి లేదా దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ దించే యోచనలో జగన్ ఉన్నారు.. విశాఖ నార్త్ నుంచి కేకే రాజు , విశాఖ వెస్ట్ నుంచి మళ్ళా విజయప్రసాద్,. గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి, చోడవరం బరిలో కరణం ధర్మశ్రీ. మాడుగుల నుంచి ముత్యాలనాయుడు. అరకు నుంచి శెట్టి ఫాల్గుణలకు టికెట్ ఖరారు అయింది. అనకాపల్లి నుంచి అమర్నాథ్ గుడివాడ లేదా దాడి రత్నాకర్, పెందుర్తి బరిలో అన్నమరెడ్డి అదీప్ రాజ్. లేదా గుడివాడ అమర్ లు ఉన్నారు. యలమంచిలి నుంచి యు.వి. రమణమూర్తి రాజు. పాయకరావుపేట నుంచి గొల్ల బాబురావు లేదా రవీంద్రబాబు. నర్సీపట్నంనుంచి పూరీజన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర్ గణేషలకు టికెట్ ఖరారు చేశారు.
విజయనగరం వైసీపీ అభ్యర్థులు జాబితా విషయానికి వస్తే .. జిల్లాలో ఉన్న 9 స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేశారు. విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం నుంచి బొత్స అప్పల నరసయ్య .. నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు . సాలూరు నుంచి రాజన్న దొర. పార్వతీపురం.. నుంచి బరిలో అలజంగి జోగారావు . కురుపాం నుంచి పాముల పుష్పశ్రీ వాణి . ఎస్ కోట నుంచి కడుబండి శ్రీనివాస రావు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ . బొబ్బిలి నుంచి సంబంగిలలు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







