ఒమన్‌లో నిర్మాణ సంస్థలకు కొత్త నిబంధనలు

- December 29, 2015 , by Maagulf
ఒమన్‌లో నిర్మాణ సంస్థలకు కొత్త నిబంధనలు

 నిర్మాణ సంస్థలకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ క్యాపిటల్‌ 25,000 ఒమన్‌ రియాల్స్‌ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే షేర్‌ హోల్డర్లలో ఒకరు ఖచ్చితంగా కంపెనీ మేనేజ్‌మెంట్‌ బాధ్యతల్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ షేర్‌ హోల్డర్స్‌లో ఎవరూ కంపెనీ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు స్వీకరించని పక్షంలో ఒమనీ మేనేజర్‌ అపాయింట్‌ చేయబడ్తారు, మరియు పబ్లిక్‌ అథారిటీలో రిజిస్టర్‌ చేయడం జరుగుతుంది. అలాగే నిర్మాణ సంస్థకు ఖచ్చిరతంగా ఒక స్థిరమైన ముఖ్య కార్యాలయం ఉండాలి. అలాగే ఫైనాన్షియల్‌ డేటా, కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్ట్స్‌ వివరాల్ని రికార్డు రూపంలో భద్రపరిచి, సంబంధిత అథారిటీకి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. తాజా వివరాల ప్రకారం 2015 మార్చ్‌నాటికి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల సంఖ్య 992,963గా ఉంది. 2014 మే నాటికి ఈ సంఖ్య 970,660. ఈ రంగంలో ఒమన్‌ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com