పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సం..
- December 29, 2015
పాకిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి బీభత్సాన్ని సృష్టించింది. మార్దాన్ నగరంలో చోటు చేసుకున్న ఈ పేలుడులో 22 మంది మరణించగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ డాటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అధారిటీ కార్యాలయం దగ్గర ఆ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియా పేర్కొంది. సెక్యూరిటీ గార్డ్ వారిస్తున్నప్పటికీ లోపలకు చొచ్చుకొచ్చిన సూసైడ్ బాంబర్ తనను పేల్చేసుకున్నాడని సీనియర్ అధికారి సయీద్ వాజిర్ తెలిపారు. పేలుడు స్వభావం ఇపుడే నిర్ణయించలేమని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. మరోవైపు క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







