ఒమన్‌లో నిర్మాణ సంస్థలకు కొత్త నిబంధనలు
- December 29, 2015
నిర్మాణ సంస్థలకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాపిటల్ 25,000 ఒమన్ రియాల్స్ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే షేర్ హోల్డర్లలో ఒకరు ఖచ్చితంగా కంపెనీ మేనేజ్మెంట్ బాధ్యతల్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ షేర్ హోల్డర్స్‌లో ఎవరూ కంపెనీ మేనేజ్మెంట్ బాధ్యతలు స్వీకరించని పక్షంలో ఒమనీ మేనేజర్ అపాయింట్ చేయబడ్తారు, మరియు పబ్లిక్ అథారిటీలో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే నిర్మాణ సంస్థకు ఖచ్చిరతంగా ఒక స్థిరమైన ముఖ్య కార్యాలయం ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ డేటా, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ వివరాల్ని రికార్డు రూపంలో భద్రపరిచి, సంబంధిత అథారిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తాజా వివరాల ప్రకారం 2015 మార్చ్నాటికి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల సంఖ్య 992,963గా ఉంది. 2014 మే నాటికి ఈ సంఖ్య 970,660. ఈ రంగంలో ఒమన్ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







