హైదరాబాద్: ఫిలింనగర్ శ్రీవారి ఆలయంలో మహాకుంభాభిషేకం
- March 14, 2019
హైదరాబాద్:జూబ్లీహిల్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం 6 నుండి 7.30కు మీన లగ్నంలో మహాకుంభాభిషేకం జరిగింది. ఆ తరువాత భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ రూ.28 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టామని తెలిపారు. మార్చి 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. ఆలయంలో ఇంజినీరింగ్ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారని, ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టారని, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు అందించిందని వివరించారు. ఐదు ఎకరాల స్థలం ఉచితంగా ఇస్తే శ్రీవారి ఆలయం నిర్మిస్తామని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు ఈవో తెలిపారు.
ఈ కుంభాభిషేకం కార్యక్రంలో టి.టి.డి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ,తిరుమల జె.ఈ.వో కె.యస్ శ్రీనివాస రాజు ,తిరుపతి జె.ఈ.వో లక్ష్మీకాంతం,సీవీఎస్వో గోపినాథ్ జెట్టి ,ఆలయ ఓఎస్డి పాలశేషాద్రి,బొక్కసం ఇంచార్జి గురు రాజారావు,ధర్మకర్తల మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు ,రమేష్ బాబు ,ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు,స్థానిక సలహామండలి సభ్యులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







