వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి:రివ్యూ

- March 16, 2019 , by Maagulf
వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి:రివ్యూ

విడుదల తేదీ : మార్చి 15, 2019

 
నటీనటులు : రాయ్ లక్ష్మీ , నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్, మధునందన్, ప్రవీణ్ మరియు పంకజ్ త‌దిత‌రులు.

దర్శకత్వం : కిషోర్ కుమార్

నిర్మాత : ఎం. శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌. ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి.

సంగీతం : హరి గౌర

స్క్రీన్ ప్లే : కిషోర్ కుమార్

ఎడిటర్ : యస్ అర్ శేఖర్

వేర్ ఈజ్ వెంకటలక్ష్మి… టైటిల్ లో ఉన్న తెలుగు ఇంగ్లీష్ మిక్స్ లాగా ఉన్న ఈ కథ లో ఎంటర్ టైన్ చేయడానికి మంచి కమీడియన్స్ తో పాటు యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికి రాయ్ లక్ష్మి ఉన్నారు. తెలుగు సినిమా కథలు గ్రామీణ వాతావరణం వైపు నడుస్తున్నటైం వచ్చిన హార్రర్ కామెడీ ఎంత వరకూ ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం…

కథ :

గోదారి జిల్లాలోని యెటకారం తో పాటు పోరంబోకులు అనే టైటిల్స్ కి నిలువెత్తు నిదర్శనంగా ఉండే పండు( మధు), చంటి( ప్రవీణ్) బెల్లంపల్లి అనే ఊరికి పట్టిన దరిద్రం అని ఊరంతా ఫిక్స్ అవుతుంది. వారి జీవితాల్లోకి వెంకటలక్ష్మి ( రాయ్ లక్ష్మి) అనే టీచర్ వస్తుంది. ఆ అమ్మాయిని పోటీలు పడి ప్రేమిస్తారు పండు, చంటి అయితే ఆ అమ్మాయి దెయ్యం అని తెలుస్తుంది. అంతే కాదు తమకు మాత్రమే కనపడే వెంకట లక్ష్మి వాళ్ళను వదిలేయ్యాలంటే వారికి ఒక పని చెబుతుంది. అయితే ఆ పనేంటి దానికి వెంకట లక్ష్మి వారినే ఎందుకు ఎంచుకుంది అనేది మిగిలిన కథ..?

కథనం:
కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. కథగా వినే క్రమంలో వాటని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సినిమాగా మారేటప్పుడు జాగ్రత్త వహించకపోతే వాటి పరిణామాలు ఎలా ఉంటాయి అనడానికి ఎగ్జాంపుల్ ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. ఈ కథ లో చంటి, పండు పాత్రలలో పోషించిన ప్రవీణ్, మధు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. గోదారి ఎటకారాన్ని తమ బాడీ లాంగ్వేజ్ లో నింపి కావాల్సినంత హాస్యం పండించారు. పూజిత పోన్నాడ, రామ్ కార్తిక్ జంట చూడటానికి బాగుంది. పూజిత పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా ఈ సినిమాలో ప్రొజెక్ట్ అయ్యింది. అయితే కథ ను నడిపే సన్నివేశాలను రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఒకప్పుడు ఇవివి సృష్టించిన బెండ్ అప్పావారు, కత్తి కాంతారావు లాంటి సినిమాను ఇప్పుడు ప్రజెంట్ చేసాడు. జనరేషన్ గ్యాప్ ని గుర్తించలేకపోయాడు. కొన్ని సన్నివేశాలలలో నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. రాయ్ లక్ష్మి తన పాత్రతో పూర్తిగా ఎట్రాక్ట్ చేసింది. ఇక విలన్ చేసిన పాత్రధారి చాలా బాగా నటించాడు. ‘భయపడుతున్నట్లు నటిస్తున్నాడంటే మనం భయపెట్టినట్లు నటించాం అన్నమాట’ లాంటి డైలాగ్స్ బాగున్నాయి. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలో అక్కడ పరిసరాలను, చాలా ఎఫెక్టివ్ గా వాడుకొని కథా, కథనాలను నడిపించాడు. సెకండాఫ్ కొచ్చేసరికి ఒక పెద్ద రాక్షసుడిగా ప్రొజెక్ట్ చేసిన వాడి ఇంట్లో నుండి ఒకటి తీసుకురావడం అంటే చనిపోవడం అన్నంత బిల్డెప్ ఇచ్చిన దర్శకుడు దాన్ని అంతే గ్రిప్పింగ్ నడిపంచలేకపోయాడు. విలన్ ఇంట్లోకి దూరి తమ ఐడెంటిటీని దాచుకొని కామెడీలు చేసే కాలం నుండి దర్శకుడు ఇంకా బయటకు రాలేదు అనిపిస్తుంది. ప్రవీణ్ మధు, రాం కార్తిక్ , పూజితా పొన్నాడ తమ పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడు కిషోర్ తీసుకున్న కథ, కథనాలు గాడి తప్పడంతో వెంకటలక్ష్మి మీద ఆసక్తి పోయింది.

చివరిగా:
వెంకట లక్ష్మి ట్రాక్ తప్పింది.

--మాగల్ఫ్.కామ్ రేటింగ్ 2/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com