ఇంటికోసం బ్యాంకు లోన్ తీసుకుంటున్నారా..
- March 16, 2019
సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం కొంత కూడబెట్టిన సొమ్ముకి తోడు మరి కొంత బ్యాంకు నుంచి అప్పుతీసుకోవడం జరుగుతుంది. మరి బ్యాంకునుంచి రుణం తీసుకునేముందు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. బ్యాంకుకి వెళ్తే వాళ్లే చెబుతారు కదా అని అనుకోవద్దు. మనకి కూడా ఆ విషయం పట్ల కొంత అవగాహన ఉంటే మంచిది. రుణం తీసుకునేముందు తెలుసుకోవలసిన ప్రాథమిక నిబంధనలను గురించి తెలుసుకుందాం.
వాల్యుయేషన్ ఫీజు..
బ్యాంకు ఇంటి రుణం ఇచ్చే ముందు మీ ఆస్తి తాలుకూ పత్రాలను సరి చూస్తుంది. ఒక వేళ మీరు తీసుకున్న రుణం కట్టలేని పక్షంలో తిరిగి ఆ మొత్తాన్ని రాబట్టుకునేలా బ్యాంకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం బ్యాంకుకు సంబంధించిన ఓ వ్యక్తి వచ్చి మీ సైట్‌ని సందర్శిస్తారు. అతను మీరు తీసుకునే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌పై కోట్స్‌ను ఇస్తారు. అందుకోసం అతడు కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. దాన్ని లోన్‌కోసం దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది.
డాక్యుమెంటేషన్ ఛార్జీలు
ఇంటి రుణం పొందేందుకు ఎక్కువ భాగం పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బ్యాంకులు రుణం ఇచ్చే ముందేదరఖాస్తు దారుని నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. బ్యాంకుకు ఇంటికి సంబంధించిన పేపర్లన్నీ సమర్పించేముందే మీ దగ్గర కూడా ఓ సెట్ జిరాక్స్ తీసి పెట్టుకుంటే మంచిది.
ఇంటి రుణం మార్చుకునే అవకాశం
బ్యాంకు నుంచి ఇంటి రుణం పొందిన తరువాత వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, మరొక బ్యాంకు తక్కువకే ఇంటి రుణం అందిస్తుంటే ఆ బ్యాంకుకు మారడం మంచిది. ఇలా మార్చుకునేటప్పుడు మీరు తీసుకున్న రుణాన్ని బట్టి కొంత ఫీజు రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ
స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. మీరు కొనుగోలు చేసిన ఇంటి విలువను బట్టి స్టాంప్ డ్యూటీ ఆధారపడి ఉంటుంది. వాల్యుయేషన్ సంస్థనుంచి మీ అపార్ట్‌మెంట్ విలువ, కారు పార్క్ విలువ, ప్లోర్ రేటు వాల్యూ లాంటి అంశాలు ఉంటాయి.
వేరే ఇతర ఛార్జీలు
ఇంటి రుణం మంజూరైన తరువాత దరఖాస్తుదారుడు తర్వాత చెల్లించవలసినవి చాలానే ఉంటాయి. ప్రాసెసింగ్ ఛార్జీలని, డాక్యుమెంటేషన్ ఛార్జీలని, చివరి చెల్లింపులని, ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణం మంజూరని, చట్టపరమైన ఫీజని కొంత, సాంకేతిక తనిఖీ రుసుమని కొంత బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటికి లోన్ తీసుకునే ప్రతి వ్యక్తికి బ్యాంకులు వసూలు చేసే ఫీజుల పట్ల అవగాహన ఉండాలి. కొన్ని బ్యాంకులు ఈ రుసుముని మాఫీ చేస్తాయి. అవి బ్యాంకుల మీద ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







