మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఎమర్జన్సీ డ్రిల్
- March 26, 2019
మస్కట్: ఒమన్ ఎయిర్పోర్ట్స్, బుధవారం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుందని పేర్కొంది. మూడు గంటలపాటు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సంబంధిత సెక్యూరిటీ, హెల్త్ మరియు ఏవియేషన్ ఎజెన్సీల సహకారంతో దీన్ని నిర్వహిస్తారు. రాయల్ ఒమన్ పోలీస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆపరేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ సెక్యూరిటీ), మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ మరియు ఫీల్డ్ మెడికల్ రెజిమెంట్), పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఒమన్ ఎయిర్, ఒమన్ ఏవియేషన్ సర్వీసెస్, స్విస్ పోర్ట్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొననున్నాయి. మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తారు. అత్యవసర వాహనాల మూమెంట్ ఎక్కువగా వుండనుంది గనుకన, ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







