ఐఆర్‌సీటీసీ కొత్త రూల్..
- March 26, 2019
వెళ్లిన పని అవలేదు. సమయానికి స్టేషన్‌కి చేరుకోగలమా లేదా అన్న టెన్షన్. లేకపోతే ట్రైన్ మిస్సయిపోతుంది. పోనీ ఆ స్టేషన్ మిస్సయితే మరో స్టేషన్‌లో రైలెక్కొచ్చు. ఈఅవకాశాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. టికెట్ రిజర్వ్ చేసుకున్న సమయంలో సూచించిన బోర్డింగ్ స్టేషన్ కాకుండా మరో స్టేషన్‌లో రైలు ఎక్కేలా ప్రయాణికులు మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
అయితే రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే మీ బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటలకు ట్రైన్ అయితే స్టేషన్ మార్చుకోవాలనుకుంటే సాయింత్రం నాలుగు గంటల లోపే మార్చుకోవాలి. గతంలో అయితే 24 గంటల ముందు మార్చుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా తీసుకు వచ్చిన ఈ మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్నవారు ఆన్‌లైన్‌లో స్టేషన్ మార్చుకోవచ్చు.
రైల్వే కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు రైల్వే ఎంక్వైరీ 139 నెంబర్‌కు కాల్ చేసి బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. తత్కాల్ టికెట్లు తీసుకున్నవారు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. మొదట ఈ విధానం శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఉండేది. ఇప్పుడు మిగతా రైళ్లకూ అనుమతి ఇస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!