బటన్ నొక్కినందుకు నెలకు లక్షా 72 వేల జీతం!!
- March 29, 2019
స్వీడన్:పొద్దున్నించి సాయింత్రం దాకా కష్టపడితేనే బాస్ బతకనిస్తాడు.. నెల వచ్చేసరికి జీతం ఇవ్వాలంటే ఏడుస్తాడు. అలాంటిది ఒక్క బటన్ నొక్కినందుకే అంత జీతమా.. ఎక్కడో చెప్పవా మేం కూడా అప్లై చేస్తాము. పక్క రాష్ట్రమైనా పర్లేదు.. కానీ ఎక్కడో స్వీడన్ దేశంలో ఈ ఉద్యోగం. అయినా వెళ్తానంటే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అస్సలు చదువుకోక పోయినా పర్లేదని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కంపెనీ. మరింకెందుకు ఆలస్యం… ఉద్యోగ వివరాలు చూస్తే..
స్వీడన్ ప్రభుత్వం గోథెన్‌బర్గ్‌లోని కోర్వ్సేగన్ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్ ప్రాజెక్టుని చేపట్టింది. ఇందులో ఓ ఉద్యోగానికి భారీ ప్రకటన ఇచ్చింది. ఇంతకీ ఏమా ఉద్యోగం, ఎంత క్వాలిఫికేషన్ కావాలో అని నిరుద్యోగులంతా ఆత్రంగా పేపర్ ప్రకటన చూశారు. అర్హతలు, అనుభవం వంటివి ఏమీ అక్కర్లేదనే సరికి మరికొంత ఆసక్తి కలిగింది వారికి. ఆహా ఎంత మంచి ఉద్యోగం అని ఎగిరి గంతేశారు. ఇంతకీ ఏం చేయాలి అని చూస్తే..
డ్యూటీలోకి రాగానే స్టేషన్‌లో ఉన్న గడియారం దగ్గర ఉన్న బటన్ నొక్కితే చాలు. అక్కడ స్టేషన్‌లో అమర్చిన బల్బులన్నీ వెలుగుతాయి. ఆ తరువాత ఇంక పనేం ఉండదు. నిద్రొస్తే పడుకోవచ్చు. బోరు కొడితే బయటకు వెళ్లొచ్చు. అలా సాయింత్రం వరకు కాలక్షేపం చేసి వచ్చి మళ్లీ సమయానికి బటన్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్లి పోవచ్చు. నచ్చినన్ని రోజులు చేయొచ్చు. ఒకవేళ మీకీ ఉద్యోగం నచ్చలేదనుకోండి నిరభ్యంతరంగా మానేయొచ్చు.
లేదు బావుంది ఇక్కడే ఉంటానంటే కూడా ఓకే చెబుతుంది కంపెనీ.. అక్కడే రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చట. నెల జీతం 2,500 డాలర్లు (మన కరెన్సీలో రూ.1.72 లక్షలు) ఫస్ట్ రాకముందే అకౌంట్‌లో పడిపోతాయి. జీతం ఒక్కటే కాదండోయ్ మరికొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయట.. ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులు, సెలవులు, రిటైర్ అయ్యాక పింఛన్ వంటివన్నీ ఉంటాయట. ఆగండాగండి అప్లై చేయడానికి రెడీ అయిపోయారా.. రైల్వే స్టేషన్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదట. అది పూర్తయిన తరువాత అప్లై చేసుకోండి.. బెస్టాఫ్ లక్.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







