మహిళను రక్షించిన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఒమన్‌

- March 29, 2019 , by Maagulf
మహిళను రక్షించిన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఒమన్‌

మస్కట్‌: రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఒమన్‌ (ఆర్‌ఎఎఫ్‌ఓ), ముసాందమ్‌ గవర్నరేట్‌ పరిధిలోని మౌంటెయిన్స్‌లో చిక్కుకుపోయిన మహిళలను రక్షించినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వెల్లడించింది. బాధిత మహిళను యూరోపియన్‌ జాతీయురాలిగా గుర్తించారు. ఓ మోస్తరు గాయాల బారిన పడ్డ ఆ మహిళను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. విలాయత్‌ ఆఫ్‌ కసబ్‌లోని అల్‌ రవ్దా ప్రాంతంలో ఓ మహిళ ఇరుక్కుపోయినట్లు అందిన సమాచారం నేపథ్యంలో ముసాందమ్‌ గవర్నరేట్‌ - సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ డైరెక్టరేట్‌ అలర్ట్‌ అయ్యింది. సంఘటనా స్థలానికి సాధారణ పరిస్థితుల్లో చేరుకోవడం కష్టమని భావించి రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్‌ని వినియోగించామని పిఎసిడిఎ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com