వడోదర లో భారీ షూటింగ్ ప్లాన్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్
- March 29, 2019
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఈ సినిమాకు సంబంధించిన అంశాలను కొద్దిరోజుల పాటు గుట్టుగా ఉంచాడు రాజమౌళి. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? ఎవరిని ఎలా చూపిస్తారు..? తదితర అంశాలపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ.. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. తన సహజ శైలికి భిన్నంగా రాజమౌళి ఏకంగా మీడియా ముందుకు వచ్చి కథాకథనం వివరాలు వెల్లడించారు.
ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్‌ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? కథ ఏమిటి..? తదితర కీలక విషయాలను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఇక తాజా విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. గుజరాత్‌లోని వడోదర నగరంలోఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ మొదలువుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని తారక్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ.. విమాన టికెట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'ఆర్ ఆర్ ఆర్ భారీ షెడ్యూల్.. నేను బయలుదేరుతున్నాను' అని ట్వీట్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ గురించి ఎన్టీఆర్ ఇలా ఈ ట్వీట్ చేయడమే ఆలస్యం.. అలా కొన్నివేల మంది లైక్ చేయడం గమనార్హం. 'హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలాగే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉండు' అంటూ అభిమానులు సంబురపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో తారక్.. కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా డైసీ అడ్గార్‌జోన్స్ నటించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాను 2020 జులై 30న అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







