దుబాయ్‌లో బాలీవుడ్ నటుడ్ని కలిసిన జాకీచాన్
- March 29, 2019
ఆసియన్ సినిమాటిక్ ఐకాన్ జాకీచాన్, ఇండియన్ యాక్టర్ సోనూ సూద్‌తో కలిసి డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఇద్దరూ కలిసి 'కుంగ్ ఫూ యోగా' సీక్వెల్ గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందిన 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో సోనూ సూద్, జాకీ చాన్‌తో కలిసి నటించిన సంగతి తెల్సిందే. తన తాజా చిత్రం 'వాంగార్డ్' షూటింగ్ కోసం వచ్చిన జాకీచాన్, అదే నగరంలో సోనూ సూద్ వున్నాడని తెలుసుకుని, ఇద్దరూ కలుసుకుని డిన్నర్‌ని ప్లాన్ చేసుకున్నారు. డిన్నర్ చాలా చాలా స్పెషల్‌గా వుందని సోనూ సూద్ చెప్పాడు. జాకీచాన్‌తో స్నేహం చాలా అద్భుతమైనదని చెప్పాడు సోనూ సూద్. జాకీచాన్ కుటుంబంతోనూ సోనూ సూద్‌కి ఎంతో అనుబంధం వుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







