ఒత్తిడికి కారణాలేంటి
- March 30, 2019
ప్రస్తుత జీవన విధానం ఉరుకుల పరుగుల మయంగా మారింది. ప్రతి రంగంలోనూ పోటీ, పరుగెత్తకపోతే ఎక్కడ వెనుకబడిపోతామోననే భయం వెంటాడుతుంది. ముఖ్యంగా, ఎవరిని చూసినా ఎదో తెలియని వెలితితో ఉంటారు. దీనికంతటికీ కారణం అభద్రత, అసంతృప్తి.
ఆధునిక సమాజంలో, నగరాల్లో నివసించే వారిలో ఇది మరింత ఎక్కువనడంలో సందేహం లేదు. చాలా మంది తమకు తాముగా సమస్యలు కొనితెచ్చుకుని డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నారు. ఈ మానసిక వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహం లేదు. అయితే, డిప్రెషన్‌కు లోనైతే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.
సాధారణంగా ఒక వ్యక్తి బయపడినపుడు హావభావాలు పూర్తిగా మారిపోతాయి. కొన్ని లక్షణాల ఆధారంగా వ్యక్తి భయపడుతున్నాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నోట్లో తడి ఆరిపోతుంది. నాలుక పిడచ కడుతుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. విరేచనాలు అవుతాయి. మూత్రం ఎక్కువగా వస్తుంది. తల తిరుగుతుంది. ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నిద్ర పట్టదు. ఏకాగ్రత దెబ్బతింటుంది. చికాకు, కోపం వస్తాయి. ఈ లక్షణాలన్నీ మనిషిని కుంగదీస్తాయి. కుటుంబ సమస్యలకు దారితీస్తాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







