జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు..

- March 30, 2019 , by Maagulf
జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు..

జమ్మూ:పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు చెలరేగిపోయారు. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ లక్ష్యంగా కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలో జరిగిన పేలుడులో ఓ సీఆర్‌పీఎఫ్‌ వాహనం దెబ్బతింది. పలువురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్‌ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఓ దుండగుడు పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఘటనా స్థలంలో భారీగా మోహరించారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పుల్వామా ఘటన తరహాలోనే మరో దాడికి ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com