ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం..

- March 30, 2019 , by Maagulf
ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం..

అతి పెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్ ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవసీ పాలసీలో విస్తృత మార్పులకు సిద్దమవుతుంది. గోప్యతా ఉల్లంఘనలు, న్యూజిలాండ్‌ నరమేధం సంఘటనల తర్వాత పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. వివక్ష పూరిత అంశాలైన శ్వేత జాతీయవాద, వేర్పాటువాదలను నిషేధించిన ఆ సంస్థ ఇప్పుడు మరో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. ఇక పై ఫేస్‌బుక్‌ లైవ్‌లను మానిటర్‌ చేయనుంది. లైవ్‌లపై అంక్షలు విధించాలని భావిస్తోంది.
ఇకపై యూసర్స్ ఫేస్‌బుక్‌‌లో ఇచ్చే లైవ్‌లపై పలు నిబంధనలను అమలు చేయనుంది.

ఈనెల15న న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి ప్రాంతంలోని రెండు మసీదులపై ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌ టారెంట్‌ అనే ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 50 మంది మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారు. క్రైస్ట్‌చర్చ్‌నరమేధాన్ని దుండగుడు లైవ్ స్ట్రీమింగ్‌ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ఇకపై ఫేస్ బుక్‌లో లైవ్ కొనసాగించాలంటే కొన్ని ప్రామాణిక అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి నింభందనలు విధించాలి అనే విషయంపై ఫేస్‌బుక్‌ పరిశీలిస్తుందని ఆ సంస్ధ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్‌ శుక్రవారం తన బ్లాగ్‌లో ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com