రియాద్‌లో డ్రోన్‌ సమ్మిట్‌

- March 30, 2019 , by Maagulf
రియాద్‌లో డ్రోన్‌ సమ్మిట్‌

రియాద్‌: కింగ్‌డమ్‌లో తొలిసారిగా సౌదీ డ్రోన్‌ సమ్మిట్‌ మరియు ఎక్స్‌పో వచ్చే నెలలో రియాద్‌లో జరగబోతోంది. అడ్వాన్సింగ్‌ సర్వైలెన్స్‌, సెక్యూరిటీ, ఎఫీషియన్సీ అండ్‌ ఆపరేషన్స్‌ అనే అంశాలపై ఈ సమ్మిట్‌ ప్రధానంగా చర్చించనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ ఈ వెంట్‌ ఏప్రిల్‌ 22న ప్రారంభమవుతుంది. సాంకేతిక ఆవిష్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఈవెంట్‌ ఓ వేదిక కానుంది. మొత్తం నాలుగు సెషన్లుగా ఈ సమ్మిట్‌ జరుగుతుంది. ఆయా సెషన్లలో కీలకమైన అంశాలపై చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న డ్రోన్‌ రంగానికి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్‌ ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com