అరుదైన పెయింటింగ్‌: 1.38 మిలియన్‌ డాలర్లకు ఆక్షన్‌

- April 02, 2019 , by Maagulf
అరుదైన పెయింటింగ్‌: 1.38 మిలియన్‌ డాలర్లకు ఆక్షన్‌

మస్కట్‌: సౌతాఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి వేసిన పెయింటింగ్‌ ధర ఆక్షన్‌లో 1.38 మిలియన్‌ డాలర్లు పలికింది. ఈ పెయింటింగ్‌లో ఓ ఒమనీ వ్యక్తి కనిపిస్తున్నారు. 'యాన్‌ అరబ్‌ మ్యాన్‌' టైటిల్‌తో ఈ పెయింటింగ్‌ రూపొందింది. సంప్రదాయ దుస్తులైన సైదీ ముసార్‌, దిష్దాషా మరియు బిష్త్‌ ధరించిన ఒమనీ వ్యక్తి ఈ పెయింటింగ్‌లో ఉన్నారు. ఎంబసీ పేర్కొన్న వివరాల ప్రకారం, 1939లో ఐలాండ్‌ ఆఫ్‌ జన్‌జిబార్‌లో వేసిన పెయింటింగ్‌గా తెలుస్తోంది. సుల్తాన్‌ ఖలీఫా బిన్‌ హరిబ్‌ బిన్‌ త్వయిని అల్‌ సైద్‌ కాలం నాటి పెయింటింగ& ఇది. మార్చి 18న కేప్‌టౌన్‌లో జరిగిన ఆక్షన్‌లో 17,070,000 సౌత్‌ ఆఫ్రికన్‌ రంద్‌లకు అమ్ముడైంది. అంటే, దీని ధర సుమారుగా 1.38 మిలియన్‌ డాలర్లన్నమాట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com