ఇంటర్ అర్హతతో ‘ఏపీ డీఈఈసెట్’.. నోటిఫికేషన్ విడుదల
- April 04, 2019
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ)
కాల వ్యవధి : రెండేళ్లు
అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయసు: 01.09.2019 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (డీసెడ్) ద్వారా
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు (పార్ట్-ఎ, పార్ట్-బి) విభాగాలుంటాయి. పార్ట్-ఎ నుంచి 60 ప్రశ్నలు – 60 మార్కులు, పార్ట్ -బి నుంచి 40 ప్రశ్నలు – 40 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 03.04.2019
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 21.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.04.2019
హల్ టికెట్ డౌన్‌లోడ్: 10.05.2019
డీఈఈసెట్ పరీక్ష: మే 15, 16 తేదీల్లో
ఫలితాల వెల్లడి: 18.05.2019
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







