గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ..
- April 04, 2019
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు ఏడాది తరువాత మళ్లీ 6 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ 6.25 శాతంగా రెపో రేటు అమలవుతోంది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికిఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది.
కొత్త ఏడాదిలో..
కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో చేపట్టిన తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ఇది కాగా.. దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో వెనకడుగు వేశాయి. అయితే అత్యధిక శాతం మంది విశ్లేషకులు పావు శాతం రెపో రేటులో కోతను అంచనా వేసిన విషయం విదితమే. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 7న చేపట్టిన పాలసీ సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో రెపో రేటు 6.25 శాతంగా అమలవుతోంది. రివర్స్ రెపో రేటు సైతం 6.25 శాతం నుంచి 6 శాతానికి పరిమితమైంది. కఠినతర విధానాలను వీడి న్యూట్రల్‌గా వ్యవహరించాలని గత సమీక్షలో ఎంపీసీ అభిప్రాయపడటం గమనించదగ్గ అంశం. తాజా సమావేశాలలోనూ 5:1 ఓటింగ్‌తో ఎంపీసీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం!
జీడీపీ 7.2 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో 7.4 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ బాటలో తొలి అర్ధభాగానికి 6.8-7.1 శాతం స్థాయిలో జీడీపీ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







