ప్రధాని మోదీకి యూఏఈ అత్యుత్తమ పౌర పురస్కారం
- April 04, 2019
యూ.ఏ.ఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్ మెడల్‌తో ప్రధాని మోదీని సత్కరించాలని నిర్ణయించింది. ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ ఈ అవార్డును మోదీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. వివిధ దేశాల అధ్యక్షులు, రాజులు, దేశాధినేతలకు ఈ అవార్డు ఇస్తారు. ఇండియా, యూఏఈ మధ్య సంబంధాలను బలోపేతం చేసిన కారణంగా మోదీకి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. రెండు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. వాటిని మోదీ మరోసారి బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయను యూఏఈ అత్యున్నత పురస్కారం జాయెద్ మెడల్ ఇవ్వాలని అధ్యక్షుడు నిర్ణయించారు అని క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.
గత నాలుగేళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి. ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారి 2015 ఆగస్ట్‌లో యూఏఈ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత 2016లో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఇండియాకు వచ్చారు. 2018లో మోదీ మరోసారి యూఏఈ వెళ్లారు. దుబాయ్‌లో జరిగిన ఆరో వరల్డ్ గవర్న్మెంట్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా మోదీ హాజరయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..