చారిత్రక ఆయుధాల ఎగ్జిబిషన్‌ ప్రారంభం

- April 04, 2019 , by Maagulf
చారిత్రక ఆయుధాల ఎగ్జిబిషన్‌ ప్రారంభం

మస్కట్‌: ఒమన్‌ అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన చారిత్రక వెపన్స్‌ కొలువు దీరిన ఎగ్జిబిషన్‌ ప్రారంభమయ్యింది. ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ ఎగ్జిబిషన్‌ ప్రజల సందర్శనార్ధం తొలి ఫేజ్‌లో అందుబాటులోకి వచ్చింది. బిర్కత్‌ అల్‌ మౌజ్‌లో బైట్‌ అల్‌ రదీదా ఆర్మ్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించబడుతుందని మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జిబిషన్‌ సందర్శనకు అనుమతిస్తారు. హౌస్‌ ఆఫ్‌ లైట్‌ వెపన్స్‌ ఎగ్జిబిషన్‌లో అత్యంత అరుదైన వెపన్స్‌ని చూసే అవకాశం వుంది. ఈ ఎగ్జిబిషన్‌లోకి ఎంట్రీ టిక్కెట్‌ విదేశీయులకు 7 ఒమన్‌ రియాల్స్‌. ఒమనీయులు అలాగే జీసీసీ జాతీయులకు 3.5 ఒమన్‌ రియాల్స్‌ మాత్రమే టిక్కెట్‌ ధర. 12 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com