గల్ఫ్ ఎన్నారై ల ఎన్నికల ప్రచారం
- April 04, 2019
బహ్రెయిన్:ఈ రోజు బహ్రెయిన్ లో ఎన్నారై లు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2014 లో TRS ప్రవాస సంక్షేమం అని చెప్పి 5 ఏండ్లు మోసం చేసిందని, చివరి సంవత్సరం జనవరి 2018 లో 100 కోట్లు ప్రకటన చేసి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకుండా మోసం చేసిందని తెలిపారు. 2018 ఎన్నికల మేనిఫెస్టో లో కనీసం ప్రవాసుల మాటే తీయలేదని అలాంటప్పుడు గల్ఫ్ ఎన్నారై లు trs కి ఓటు ఎలా వేస్తారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కె ఓటు వేయాలని గల్ఫ్ ఎన్నారై లకి వారి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెసు బహ్రెయిన్ తెలంగాణ శాఖ ప్రతినిధులు సంజీవ్ బురం మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ కవిత తన నియోజకవర్గం నుండి గల్ఫ్ ప్రవాసులు ఎక్కువని వారికి ఆసరా గా ఉంటానని 2014 లో చెప్పి 5 ఏండ్లు ఎలాంటి చర్యలు చేబట్టలేదని. గల్ఫ్ ఎన్నారై లు ఈ సారి కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ కె ఓటు వేయాలని పిలుపునిచ్చారు
రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నారై మంత్రి రామారావు 2016 లో ఒక ఎన్నారై మీటింగ్ పెట్టి పత్రికా ప్రకటన లకే పరిమితం అయ్యారని వచ్చే ఎన్నికల్లో trs కి ఓటు వేయకుండా కాంగ్రెస్ కె వేయాలని తెలిపారు.
విజయ్ మార్తాడ్ మాట్లాడుతూ తెరాస, బీజేపీ 2 దొందు దొందే నని ఎన్నారై లకి చేసింది ఏమి లేదని ప్రవాస కుటుంబాలకు ఆసరా ఉంటే అని ప్రకటించిన రాహుల్ గాంధీ వెంటే ఎన్నారై లు నిలవాలని కోరారు.
అవదూత నరేష్ మాట్లాడుతూ. కెసీర్ మాయ మాటలకు మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని 16 మంది trs అభ్యర్థులు ఓడి పోతే ముఖ్యమంత్రి పని చేస్తారని అన్నారు.
ముఖ్య అతిధి గా పాల్గొన్న లండన్ ఎన్నారై గంప వేణుగోపాల్ మాట్లాడుతూ కెసీర్ 2 వ విడత 100 రోజుల పాలన శ్వేత పత్రం విడుదల చేయాలని ఏ ఏ శాఖల్లో ఏమి పనులు ప్రారంభించారో ప్రజలకి చెప్పాలని తెలిపారు.
యూరోప్, uk, ఆస్ట్రేలియా , దుబాయ్ , బహ్రెయిన్ ఎన్నారై లు నిజామాబాద్ లో trs అభ్యర్థి కవిత ని ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ గౌడ్ ని గెలిపించాలని పత్రికా ముఖం గా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గంప వేణుగోపాల్, సంజీవ్ బురం, రాజేశ్వర్ గౌడ్ పడాల, విజయ్ మార్తాడ్, అవదూత నరేష్,గంగాధర్, రాయమల్లు,చిన్న,మహేష్,శరత్, సురేష్ ,శ్రీను లు పాల్గొని నిజామాబాద్ లో మధు యాష్కీ కె ఓటు వేయాలని ఉమ్మడి ప్రకటన చేశారు.
--యం.వాసుదేవ రావు (మా గల్ఫ్,ప్రతినిధి)

తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







