పబ్లిక్ పార్క్‌లో తొలి స్కేటింగ్ ఫెసిలటీ
- April 05, 2019
యూఏఈలో తొలిసారిగా పబ్లిక్ పార్క్‌లో స్కేటింగ్ ఫెసిలిటీని ప్రారంభించబోతున్నారు. మే నెలలో దీన్ని ప్రారంభిస్తామని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. సక్ర్ పార్క్‌లో ఈ స్కేట్ పార్క్ నిర్మాణం కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. 620 మీటర్ల పొడవైన స్కేటింగ్ పార్క్ ఘాప్ ట్రీ రిజర్వ్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన నీడలో స్కేటింగ్‌ని ఔత్సాహికులు ఎంజాయ్ చేయడానికి ఆస్కారమేర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. బౌల్, పిరమిడ్స్, లెడ్జెస్, బ్యాంక్స్ మరియు రౌండ్ రెయిల్స్ వంటి అబ్స్టాకిల్స్ని స్కేటర్స్‌కి డిఫరెంట్ లెవల్స్‌లో ఇక్కడ పొందుపరుస్తున్నారు. స్కేట్ బోర్డింగ్, రోలర్ బ్లేడింగ్ మరియు బిఎంఎక్స్ బైక్ రైడింగ్ వంటి సౌకర్యాలతో ఇకపై ఈ పార్క్ సరికొత్త శోభను సంతరించుకోబోతోందని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ హైతమ్ మట్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..