దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- April 05, 2019
మస్కట్: బౌషర్‌లో ముగ్గురు అరబ్ జాతీయుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ కారు అద్దాల్ని పగులగొట్టి, అందులోని డబ్బుని కొల్లగొట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 12,000 ఒమన్ రియాల్స్‌కి పైగా నిందితులు కారులోంచి దొంగిలించారు. ఒమన్‌కి టూరిస్ట్ వీసాపై నిందితులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ నుంచి బాధిత వ్యక్తి డబ్బుతో రావడం గమనించిన నిందితులు, అతన్ని ఫాలో అయ్యారనీ, కారు పార్క్ చేసి బాధితుడు వెళ్ళగానే అందులోంచి నగదు దొంగిలించారనీ అధికారులు వివరించారు. డబ్బును బ్యాంకు నుంచి తీసేటప్పుడు, దాన్ని తరలించేటప్పుడు అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్, సిటిజన్స్ అలాగే నివాసితులకు సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..