ఒక్క రూపాయికే పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్
- April 05, 2019
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ మరో సంచలనానికి తెరతీసింది. ఉగాది సందర్భంగా ‘ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్2019’ ను ప్రకటించింది. మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది షావోమీ.
ఏప్రిల్ 4వ తేదిన ఫ్లాష్ సేల్‌లో ఒక్క రూపాయికే రెడ్‌మీ నోట్ 7 ప్రో, ఎంఐ సౌండ్‌బార్ వంటివి విక్రయించింది షావోమీ. ఇక 5 న మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షావోమీ. ఈ సేల్‌లో పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.1 కే పొందవచ్చు. మొత్తం 20 స్మార్ట్‌ఫోన్లను రూపాయికే విక్రయించనున్నట్లు ప్రకటించింది షావోమీ.
ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్‌ను కూడా రూపాయికే విక్రయించనున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్‌లో 20 హోమ్ కెమెరా యూనిట్లు ఉంటాయిని తెలిపింది. ఏప్రిల్ 6వ తేది వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 జరగనుంది.
ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫ్లాష్ సేల్ స్టార్ అవుతుంది. ఈ ఆఫర్లు పొందాలంటే mi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లేదా యాప్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. ఫ్లాష్ సేల్ కాబట్టి సెకనుల్ల వ్యవధిలోనే సేల్ ముగిసిపోతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..